ఈరోజు ఎస్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు ఫ్యాప్టో రాష్ట్ర చైర్మన్ లంకలపల్లి సాయి శ్రీనివాస్, రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాలను సందర్శించి అధ్యాపక విద్యారంగ సమస్యలపై మాట్లాడటం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిట్మెంట్ జీవో 58 సాధించడంలోనూ 68 ప్రిన్సిపల్ పోస్టులు సాధించడంలోనూ యుజిసి ఏరియర్ 503 కోట్ల రూపాయలు సాధించడంలోను ఎస్టియు ఎమ్మెల్సీలు తీవ్రమైన కృషి చేశారని, అదేవిధంగా కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ అమలు చేయుటలో కూడా ఎస్ టి యు కీలకపాత్ర వహించిందని, గెస్ట్ లెక్చర్ల గౌరవ వేతనం 14,400 నుండి 28,000 పెంచడానికి తీవ్రమైన కృషి జరిగిందని తెలిపారు.
2026 జూలై డిగ్రీ కళాశాల అధ్యాపకుల బదిలీ జీవో సాధనకు ఎస్టియు తీవ్ర కృషి చేసిందని, ఇంకను సాధించవలసిన డిగ్రీ లెక్చరర్ల డెసిగ్నేషన్ను అసిస్టెంట్ ప్రొఫెసర్ గా మార్పించడానికి, అదే విధంగా యాన్యువల్ ఇంక్రిమెంట్లు, సిఐఎస్ ఇంక్రిమెంట్లు మధ్య నష్టాన్ని సవరించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పారు. కాలేజీ అడ్మిషన్ల ప్రక్రియ జూలైలోనే ప్రారంభం కావాలని, ఆగస్టులో చేయటం వల్ల విద్యార్థులు ఇతర కోర్సులకు వెళ్లిపోతున్నారని దీనివలన డిగ్రీ కాలేజీల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని, దీనిని సవరించడానికి ప్రయత్నం చేస్తామని, నెట్టు స్లెట్టు పీహెచ్డీలు పూర్తిచేసిన డిగ్రీ లెక్చరర్లకు స్టేట్ ఫిట్మెంట్ ఫార్ములా అమలు చేయడానికి కృషి చేస్తామని తెలియజేశారు. కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ గెస్ట్ లెక్చరర్ లకు మినిమం టైమ్ స్కేల్ వర్తింపు చేసే విధంగా ప్రభుత్వాన్ని ఒప్పించడానికి కృషి చేస్తామని తెలియజేశారు.
ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ Mrs. వసంత లక్ష్మి గారు, GCTA-AP ప్రభుత్వ కళాశాల టీచర్స్ అసోసియేషన్ కార్యదర్శి Dr. M. శ్యాం బాబు గారు, కామర్స్ విభాగపతి Dr. B P. నరసారెడ్డి గారు, Dr. M. R. గౌతమ్, Dr. షణ్ముఖ రావు గారు, జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు, వివిధ ప్రభుత్వ కళాసాల లెక్చరర్స్ పాల్గొనడం జరిగింది. పాలిటెక్నిక్ కళాశాలల అధ్యాపకుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింహారావు ఎస్ టి యు తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి డేనియల్ బాబు కళాశాల అధ్యాపకులు తదితరులు హాజరయ్యారు.